Asianet News TeluguAsianet News Telugu

కరోనా బాధితుల చికిత్స కోసమే రూ.1000 కోట్లు: మంత్రి ఆళ్ళ నాని వెల్లడి

కరోనా నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో  ఆర్ఆండ్‌బి అతిధి గృహంలోని సమావేశ మందిరంలో శనివారం మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు.

AP Health Minister Alla Nani Review Meeting on Corona
Author
Amaravathi, First Published Jul 25, 2020, 9:27 PM IST

విజయవాడ: రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అదేశించారని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా బాధితుల వైద్యం విషయంలో ఎంత ఖర్చయినా వెనుకడుగు వేయవద్దని సీఎం సూచించారని  అన్నారు. అందువల్లే కోవిడ్19 పేషెంట్స్ కి ప్రత్యేకంగా చికిత్స అందించే హాస్పిటల్స్ పెంపు, అందులో సదుపాయాలు కల్పన కోసం వచ్చే 6నెలల్లో దాదాపుగా రూ.1000కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు వైద్యమంత్రి వెల్లడించారు. 

కరోనా నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో  ఆర్ఆండ్‌బి అతిధి గృహంలోని సమావేశ మందిరంలో శనివారం మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపి మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి,  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాష్ట్ర కరోనా నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు, డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారితో పాటు మరికొందరు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ... కరోనా వైరస్ సోకిన రోగికి ఒక్కో డోసుకు 35వేల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. కోవిడ్ మరణాలు తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో అత్యవసర మందులు అందుబాటులోలోకి తీసుకురావాలని సీఎం అదేశించారని మంత్రి తెలిపారు. 

డాక్టర్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... ఇందుకోసం ఐఎంఏ ప్రతినిధి బృందంతో మాట్లాడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ సిబ్బందిని పెంచుతున్నామని తెలిపారు. 

read more  కరోనా మరణాలను తగ్గించేందుకు... జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం

ఇక కరోనా రోగుల కోసం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో బెడ్స్ పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 139కోవిడ్ హాస్పిటల్స్ త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో 22,500 ఆక్సిజన్ సౌకర్యంతో బెడ్స్ అందుబాటులో ఉంచామని... ఇప్పటికే 2,644మంది బాధితులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామన్నారు.  త్వరలో 10వేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కు 15వేల డోసులు పంపిస్తున్నామని తెలిపారు. ఆగష్టు మూడవ వారం నాటికీ దాదాపు గా 90వేల పైగా డోసులు కోవిడ్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని బెడ్స్ ఉన్నాయో హాస్పిటల్ ఆవరణలో బోర్డు పెట్టాలని సూచించారు. వీటి కోసం ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

గణాంకాల ప్రకారం క్రిటికల్ కేర్ చికిత్స అవసరమైన రోగులు సంఖ్య పాజిటివ్ కేసుల్లో 7నుంచి 8% వరకు మాత్రమే ఉందన్నారు. కరోనా కారణంగా తీవ్ర అశ్వస్థత కు గురైన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్స్ తో పాటు కోవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్నప్రాంతాలపై దృష్టి పెట్టి పరీక్షలు జరిపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 

పెరుగుతున్న కేసులు దృష్ట్యా మరో 54 హాస్పిటల్స్ కోవిడ్ బాధితులు కోసం గుర్తించామన్నారు. క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం,పారిశుధ్యం కూడ మెరుగుగా ఉండాలని సీఎం ప్రత్యేకంగా అదేశాలు ఇచ్చారన్నారు. ప్రతి రోజు కోవిడ్ పరీక్షలు కోసం రూ.5కోట్లు,  క్వారంటైన్ సెంటర్స్  లో భోజనం, పారిశుధ్యం కోసం మరో రూ.1.5కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నాని వెల్లడించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios