పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ నెల 19న నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నిరుపేద విద్యార్ధులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ నెల 19న నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్ధుల ఖాతాలో జమ చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 18నే కార్యక్రమం జరగాల్సి వుండగా.. సీఎం సభా వేదికకు పక్కనే వున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో జగన్ తన కార్యక్రమాన్ని 19కి వాయిదా వేసుకున్నారు. 

కాగా.. జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఇతర కోర్సులు చదివేవారికి రూ.20 వేలు, ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. కళాశాలలకు కట్టాల్సిన ఫీజులను 3 నెలలకొకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.