ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు తెలిపింది. 12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి కేంద్రాల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.