సుగాలి ప్రీతి కేసులో జగన్ సంచలన నిర్ణయం .. పవన్ ర్యాలీకి బ్రేక్

రేపు పర్యటన అనగా.. ఇప్పటికే సీబీఐకి అప్పగించామంటూ ప్రకటించారు. కేవలం పవన్ ర్యాలీని ఆపడానికే ఈ ప్రకటన చేశారా అనే అనుమానలు కూడా కలుగుతుండటం గమనార్హం. 2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. 

AP Govt Gave Green Signal For CBI Investigation In Sugali Preethi Case

కర్నూలు జిల్లాలో మూడు సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన విద్యార్థిని సుగాలి ప్రీతి కేసు విషయంలో జగన్ సర్కార్ సంచల నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జగన్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప తెలిపారు. దీనికి సంబంధించిన వివాలను కేంద్ర హోంశాఖకు పంపినట్లు ఆయన చెప్పారు. 

సుగాలి ప్రీతి చనిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా.. తమకు కనీస న్యాయం కూడా జరగలేదంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏ ఒక్కరూ కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి జనసేన అధినేత పవన్ మద్దతుగా నిలిచారు. ఈ కేసులో సత్వర న్యాయం కోసం పవన్ బుధవారం ర్యాలీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పవన్ ర్యాలీకి ఒక్క రోజు ముందు ఈ కేసు గురించి జిల్లా ఎస్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Also Read పవన్ పర్యటన.. ప్రభుత్వంలో కదలిక: సుగాలి ప్రీతి కేసు సీబీఐ చేతికి...?

రేపు పర్యటన అనగా.. ఇప్పటికే సీబీఐకి అప్పగించామంటూ ప్రకటించారు. కేవలం పవన్ ర్యాలీని ఆపడానికే ఈ ప్రకటన చేశారా అనే అనుమానలు కూడా కలుగుతుండటం గమనార్హం. ఎస్పీ కామెంట్స్ తో నేడు జరగాల్సిన పవన్ ర్యాలీ రద్దు అయ్యింది.  2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. 

కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు.

ఆత్మహత్య అని అందరూ కొట్టిపారేయగా.. హత్యాచారం చేసి చంపేశారంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం ఈ మూడు సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios