అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి పాలనాదక్షకుడని అభివర్ణించారు ఏపీ గవర్నర్ నరసింహన్. గవర్నర్ నరసింహన్ పదవీకాలం ముగియడంతో విజయవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలులో పాల్గొన్న నరసింహన్ వైయస్ జగన్ భార్య భారతిపై ప్రశంసలు కురిపించారు.

వైయస్ జగన్ కు ఉన్న ఏకైక బలం ఆయన సతీమణి భారతమ్మ అంటూ చెప్పుకొచ్చారు. భారతమ్మ ఇచ్చే సపోర్ట్ జగన్ కు ఎంతో విలువైనదని ప్రశంసించారు. సీఎం వైయస్ జగన్- భారతమ్మల జంట ఓ ప్రత్యేకమైన జంట అంటూ చెప్పుకొచ్చారు.

ఇకపోతే జగన్ పాలన చూస్తుంటే చాలా బాగుందని ప్రశంసించారు. అసెంబ్లీలో వైయస్ జగన్ నియామవళికి అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ఎలా ఉండాలో అనేఅంశంపై గతంలో తనకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని అసెంబ్లీలో జగన్ తీరు చూస్తుంటే అలాగే ఉందన్నారు. 

మరోవైపు తాను గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడు ఏనాడైనా ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తాను తెలిసి కొన్ని తప్పులు చేశాను. తెలియక మరికొన్ని తప్పులు చేశానని అయితే వాటిని మనస్ఫూర్తిగా క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. 

తన పేరు నరసింహన్ అని అంటే తనది నరసింహ అవతారం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ అవతారంలో పనిచేశానని చెప్పుకొచ్చారు. తాను ఇక్కడ నుంచి వెళ్లిపోయినా ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ ఏపీతోనే ఉంటానని పునరుద్ఘాటించారు.

రాయలసీమలో అహోబిళం నరసింహస్వామిగా, ఉత్తరాంధ్రలో సింహాచలం నరసింహ స్వామిగా, మంగళగిరి నరసింహ స్వామిగా నిత్యం ఏపీ ప్రజలతో ఉంటానని గవర్నర్ చెప్పుకొచ్చారు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పాలన బ్యాటింగ్ ప్రతీ బాల్ సిక్సర్, బౌండరీలే, సెంచరీలు కొట్టాలి: గవర్నర్ నరసింహన్ ప్రశంసలు