విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. వైయస్ జగన్ నడిచి వచ్చిన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసించారు. జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారంటూ కొనియాడారు. 

విజయవాడలో ఆత్మీయ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ జగన్ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ 34 రోజులుగా జగన్ నిర్ణయాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను గవర్నర్ గా వస్తానని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పుకొచ్చారు. తనకు విజయవాడలోనే అక్షరాభాస్యం జరిగిందని గుర్తు చేశారు. తాను తొమ్మిదిన్నరేళ్లు గవర్నర్ గా పనిచేశానని చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్ కు గడచిన పదేళ్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లాంటిదని చెప్పుకొచ్చారు. ఈ 34 రోజులుగా సీఎం జగన్‌ పాలన ప్రతి బాల్‌ సిక్సర్‌, బౌండరీలు తాకుతున్నట్లు ఉందన్నారు. పాలనలో వైఎస్‌ జగన్‌ మరిన్ని సెంచరీలు చేయాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఆ నమ్మకం తనకు ఉందన్నారు. ఈ 34 రోజుల్లోనే తనేంటో జగన్ నిరూపించారని ప్రశంసించారు. భవిష్యత్ లో ముఖ్యమంత్రిగా జగన్ వండర్స్ సృష్టిస్తారని తెలిపారు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న టీం అద్భుత టీం అని కొనియాడారు. మంత్రులు, అధికారులు అంతా సమర్థవంతమైన వారు ఉన్నారని ఈ నేపథ్యంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.