Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు ఏపీ కౌంటర్: కేఆర్ఎంబీకి ఏపీ లేఖ, నీటి కేటాయింపులపై ఇలా..

కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లేఖ రాసింది. రెండో ట్రిబ్యునల్ ఆదేశం మేరకు నీటి పంపకాలు జరపాలని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేపట్టాలని కోరింది.

Ap government writes letter to  KRMB on water allocations
Author
Hyderabad, First Published Aug 25, 2021, 2:24 PM IST

అమరావతి: కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం  బుదవారం నాడు లేఖ రాసింది. 2021-22 వాటర్ ఈయర్ లో 70:30 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.

ఈ వాటర్ ఈయర్ లో 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. రెండో ట్రిబ్యునల్ ఆదేశాల మేరుకు నీటి పంపకాలు జరపాలని ఆ లేఖలో  ఏపీ ప్రభుత్వం కోరింది.

ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలు ప్రాజెక్టుల వారీగా చేయలేదని ఏపీ ప్రభుత్వం ఈ లేఖలో గుర్తు చేసింది. ఈ ఏడాది నీటి కేటాయింపులు చేపట్టిన తర్వాతే తెలంగాణకు నీటి వినియోగం చేసుకొనేలా చూడాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొంత కాలంగా సాగుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ఆర్డీఎస్ కుడికాలువపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి విస్తరణతో పాటు  ఇతర ప్రాజెక్టులపై  ఏపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios