అమరావతి: మద్యం ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మద్యం  ధరలను తగ్గించగా, మరికొన్ని ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ సర్కార్.

దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలను 60 ఎం ఎల్ నుంచి 190 ఎం ఎల్ వరకు ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. 180 ఎం ఎల్ మద్యానికి
రూ.190 నుండి రూ. 210 మధ్య వసూలు చేస్తున్నారు. అయితే ఈ బ్రాండ్లపై ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా మరో రూ. 40 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.

180 ఎంల్ బాటిల్ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్ల ధరలను తగ్గించింది.  రూ.30 రూపాయల నుండి రూ.120 రూపాయల వరకూ తగ్గించింది.కార్టర్ బాటిల్ ధర రూ.120 నుంచి  రూ.150  ధర ఉన్న బ్రాండ్లకు రూ. 30 నుంచి రూ.280 వరకూ తగ్గించారు.

క్వార్టర్ బాటిల్  రూ.150 నుంచి రూ.190 మధ్య  ఉన్న బ్రాండ్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.క్వార్టర్  రూ.190  నుంచి రూ. 210కి మించి ధర ఉన్న బ్రాండ్లకు రూ.40 నుండి రూ.300 పెంచింది ప్రభుత్వం.అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై రూ.30 ధర తగ్గించింది ప్రభుత్వం .రెడీ టూ డ్రింక్ మద్యం పై రూ.30 రూపాయల మేర తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఇవాల్టి నుంచే సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకొంది ఏపీ సర్కార్. ఈ మేరకు ఎస్ఈబీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాలు సేవించి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మద్యం ధరలను సవరించాలని ఎస్ఈబీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.