ఐఎఎస్ అధికారులపై ఎస్ఈసీ ప్రొసిడింగ్స్: తిప్పి పంపిన సర్కార్

ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ పై ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్రప్రభుత్వం తిప్పి పంపింది.

AP government returned SEC proceedings against IAS officers lns

అమరావతి: ఐఎఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ పై ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్రప్రభుత్వం తిప్పి పంపింది.ఎన్నికల విధులకు పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది,, కమిషనర్ గిరిజా శంకర్ లు అనర్హులంటూ ఎస్ఈసీ ఈ నెల 26వ తేదీన ప్రొసిడింగ్స్ జారీ చేశారు.

also read:ఎన్నికల విధులకు అనర్హులు: గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎస్ఈసీ సంచలనం

2021 ఓటర్ల జాబితా తయారీ ఆలస్యానికి ఈ ఇద్దరు కారణమని  కూడ ఈ ప్రొసిడింగ్స్ లో ఎస్ఈసీ అభిప్రాయపడింది. ఈ ప్రొసిడింగ్స్ ను ప్రభుత్వానికి పంపింది ఎస్ఈసీ.

అయితే ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసిడింగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల నుండి వివరణ తీసుకోకుండానే ప్రొసిడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు  ఈ ప్రొసిడింగ్స్ ను తిప్పి పంపుతూ  కారణాలను పేర్కొంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంపారు. 

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సెన్సూర్ ప్రొసిడింగ్స్ ను ఎస్ఈసీ పంపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios