Asianet News TeluguAsianet News Telugu

పెట్టుబడులకు ఏపీ స్వర్గథామం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో సీఎం జగన్

పెట్టుబడులకు పెట్టేందుకు  ఏపీ రాష్ట్రంలో  మంచి అవకాశాలున్నాయని సీఎం జగన్  చెప్పారు.  రాష్ట్రంలో  పరిశ్రమల ఏర్పాుటుకు  ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని సీఎం తెలిపారు. 
 

AP Government Provides facilities to investors : AP CM YS Jagan
Author
First Published Jan 31, 2023, 5:05 PM IST

న్యూఢిల్లీ:పెట్టుబడులకు  ఏపీ రాష్ట్రం  స్వర్ఘథామమని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.   గ్లోబల్  ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో  ఏపీ సీఎం వైఎస్ జగన్   పాల్గొన్నారు. మంగళవారం నాడు మధ్యాహ్నం జరిగిన సెకండ్ సెషన్ లో ఆయన   ప్రసంగించారు.    ఏపీ రాష్ట్రంలో  ఇప్పటికే ఆరు ఓడరేవులున్నాయన్నారు.  మరో నాలుగు  కొత్త ఓడరేవులు నిర్మిస్తున్నట్టుగా  చెప్పారు.  

రాష్ట్రంలో  పరిశ్రమల ఏర్పాటుకు  అపార వనరులున్నాయని ఆయన  తెలిపారు.రాష్ట్రానికి సుదూర  తీర ప్రాంతం  ఉందని సీఎం జగన్  చెప్పారు.  వరుసగా  మూడేళ్ల పాటు  ఏపీ రాష్ట్రం  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో  నెంబర్ వన్ గా నిలిచిందని   జగన్ వివరించారు.  11.43 శాతం వృద్ది రేటుతో  దేశంలోనే అత్యంత వేగంగా  ఏపీ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని  ఆయన తెలిపారు.  దేశ వ్యాప్తంగా  ఏర్పాటు  చేస్తున్న  11 ఇండస్ట్రీయల్ కారిడార్లలో  ఏపీకి మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు  రావడం శుభ పరిణామంగా  ఆయన పేర్కొన్నారు. 

also read:ఏపీకి త్వరలో విశాఖపట్టణం రాజధాని: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్

సోలార్ విండ్ ఎనర్జీలో  ఏపీలో  అపార అవకాశాలున్నాయని  ఆయన  చెప్పారు.  పరిశ్రమలకు  అవసరమైన నీరు ఇతర మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్దంగా  ఉందని  సీఎంతెలిపారు.  పారిశ్రామికవేత్తలకు  ఎలాంటి అవసరాలున్నా  కూడా  ఒక్క ఫోన్ కాల్ తోనే  సమస్యను పరిష్కరించనున్నట్టుగా  సీఎం జగన్  స్పష్టం  చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios