అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి విధుల్లో నియమించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశించింది.

also read:ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

ఏపీ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ పెద్దలు కొందరు సీనియర్ న్యాయవాదులతో చర్చించినట్టుగా సమాచారం. ఏపీ హైకోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తిస్థాయి కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ కనగరాజ్ నియమిస్తూ ఇచ్చిన జీవోలను కూడ హైకోర్టు కొట్టివేసింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ కీలక తీర్పు చెప్పింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.