ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించడంతో  కొత్తగా నియమితులైన కనగరాజ్ ఈ బాధ్యతల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారింది.

Nimmagadda Ramesh kumar will take charge as AP SEC

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించడంతో  కొత్తగా నియమితులైన కనగరాజ్ ఈ బాధ్యతల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారింది.

also read:జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  ప్రభుత్వం తిరిగి నియమించాలని కూడ హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాను విధుల్లో చేరుతానని ఆయన శుక్రవారం నాడు ప్రకటించారు.

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం నియమ నిబంధనల్లో మార్పులు చేర్పులు తెచ్చింది. సంస్కరణల్లో భాగంగా మార్పులు తెచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం చెప్పింది. సంస్కరణల పేరుతో రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చిందని ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

కొత్త ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నియామకం చెల్లదని కూడ హైకోర్టు తీర్పు చెప్పింది.ఎస్ఈసీ నిబంధనలను మార్చడాన్ని కూడ హైకోర్టు తప్పుబట్టింది. తనను ఎన్నికల సంఘం కమిషనర్ పదవి  నుండి తప్పించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.

 ఈ పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీని కనగరాజ్ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios