వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు తదితర సామాజిక పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ కానుక అందించేందుకు సిద్దమయ్యింది.
అమరావతి: నూతన సంవత్సరానికి ముందే జగన్ సర్కార్ సామాజిక పెన్షన్ (Social pension) దారులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో వద్ధ్యాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత తదితర విభాగాలకు చెందిన సామాజిక పెన్షన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు ఇప్పటికే వైసిపి ప్రభుత్వం (ysrcp government) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పెన్షన్ పెంపుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజాగా జగన్ సర్కార్ (jagan government) జారీ చేసింది.
వైఎస్సార్ పెన్షన్ కానుక (ysr pension kanuka)లో భాగంగా ఇస్తున్న సామాజిక పెన్షన్లలో ఈ పెంపుదలను వర్తింపచేస్తున్నట్టు పేర్కోంటూ పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేసారు. పెన్షన్ల పెంపు 2021 డిసెంబరు నుంచి వర్తిస్తుందని... 2022 జనవరి 1వ తేదీన పెరిగిన మొత్తంతో పెన్షన్ డబ్బులు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల పెంపుదలతో ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.129 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
2017 లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ల సామాజిక పెన్షన్ల పెంపుపై హామీ ఇచ్చారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెన్షన్లకు వెయ్యి రూపాయల నుండి రెండు వేలకు పెంచారు. దీంతో ఈ మొత్తాన్ని మూడు వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు.
read more వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500
పెన్షన్ డబ్బుల పెంపు హామీని వైసిపి ఎన్నికల మేనిపెస్టోలో కూడా పోందుపర్చారు. అయితే ఒకేసారి కాకుండా విడతల వారిగా పెన్షన్ల పెంపు చేపడతామని మేనిపెస్టోలో పేర్కొన్నారు. ఈక్రమంలోనే అధికారంలో వచ్చిన వైసిపి వృద్దాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు తదితరులకు ఇచ్చే పెన్షన్ ను మొదటి విడతగా రూ.250 పెంచారు. ఇలా ప్రస్తుతం రూ.2,250 రూపాయలు ఇస్తున్నారు.
ఇక రెండో విడత పెన్షన్ల పెంపును ఈ నెల నుండే ప్రారంభించనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. మరో రూ.250 పెంచి డిసెంబర్ 2021కి సంబంధించిన రూ.2,500 పెన్షన్ జనవరి 2022 నూతన సంవత్సర ఆరంభం రోజున ఇవ్వనున్నట్లు తాజా ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతేడాది ఆరంభంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నెలా గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ సొమ్ము అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంగా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
read more ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవీయత.. ఆటో దగ్గరకెళ్లి వృద్ధుడి పెన్షన్ పునరుద్ధరణకు ఆదేశాలు
కరోనా నియంత్రణలో భాగంగా ఈ పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను ఉపయోగించారు. బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫోటోలు జియో ట్యాగింగ్ చేసారు. లాక్ డౌన్ సమయంలో వేరే ప్రాంతాల్లో వున్న వారికి ఫించన్లు అందించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసారు. ఇతర ప్రాంతాల్లో వున్నవారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందించారు.
