అమరావతి అసైన్డ్ భూముల ఇష్యూ: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భద్రత పెంపు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అదనంగా మరో నలుగురు గన్‌మెన్లను కేటాయించారు. 
అమరావతిలో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీకి  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు  గన్ మెన్లను కేటాయించారు.
 

AP government allots additional four gunmen to Mangalagiri MLA Alla Ramakrishna Reddy lns

అమరావతి:మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అదనంగా మరో నలుగురు గన్‌మెన్లను కేటాయించారు. 
అమరావతిలో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీకి  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు  గన్ మెన్లను కేటాయించారు.

గత ప్రభుత్వం  అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహరంలో అవకతవకలకు పాల్పడిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  ఈ విషయమై  గత నెలలోనే సీఐడీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

also read:అమరావతిలో అసైన్డ్ భూముల ఇష్యూ:సీఐడీ కార్యాలయానికి ఆళ్ల

తన వద్ద ఉన్న ఆధారాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం నాడు ఏపీ సీఐడీకి అందించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి నలుగురు గన్ మెన్లను కేటాయించారు. ప్రస్తుతం ఉన్న గన్ మెన్లకు అదనంగా గన్ మెన్లను కేటాయించారు.ఈ నోటీసులపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణలు ఏపీ హైకోర్టులో ఇవాళ హైకోర్టులో క్యాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios