ఏపీ బడ్జెట్: ఈబీసీతో పాటు పలు రంగాలకు అధిక కేటాయింపులు
గత ఏడాది కంటే కొన్ని రంగాలకు ఏపీ ప్రభుత్వం ఎక్కువగా నిధులను కేటాయించింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు.
అమరావతి:గత ఏడాది కంటే కొన్ని రంగాలకు ఏపీ ప్రభుత్వం ఎక్కువగా నిధులను కేటాయించింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. రూ. 2,29,779 కోట్లతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించాడు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం రూ 1,82,196 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ లోటును రూ. 5 వేల కోట్లుగా తేల్చి చెప్పింది.జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు రూ.3.49 శాతంగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
also read:ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : రూ.2,29,779 కోట్లతో బడ్జెట్, హైలైట్స్ ఇవీ..
ఈబీసీ సంక్షేమం
ఈ ఏడాది (2020-21) రూ.5,478 కోట్లు
గతేడాది (2020-21) రూ.5,088.55 కోట్లు
కాపు సంక్షేమం
2020-21లో రూ.3,090 కోట్లు
ఈ ఏడాది రూ.3,306 కోట్లు. మొత్తం 7 శాతం అధిక కేటాయింపులు
బ్రాహ్మణుల సంక్షేమం
2020-21లో రూ.124 కోట్లు
ఈ ఏడాది రూ.359 కోట్లు
189 శాతం అత్యధిక కేటాయింపులు
ఎస్సీ ఉప ప్రణాళిక
22 శాతం అధిక కేటాయింపులు చేశారు.
ఈ ఏడాది రూ.17,403 కోట్లు
గతేడాది రూ.14,218 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక
ఈ ఏడాది రూ.6,131 కోట్లు కేటాయింపు.. ఇది గత ఏడాది కంటే 27 శాతం అధిక కేటాయింపు
గతేడాది: రూ.4,814 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్‌తో పాటు మైనార్టీ ఉప ప్రణాళికలో కేటాయింపులు భారీగా పెంచారు.
మొత్తం 27 శాతం అధిక కేటాయింపులు ప్రభుత్వం చేసింది.
ఈ ఏడాది మొత్తం కేటాయింపులు రూ.3,840.72 కోట్లు
2020-21లో రూ.1,634 కోట్లు