బాలినేనితో సజ్జల భేటీ: సీఎంతో భేటీ కానున్న శ్రీనివాస్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. రెండు రోజుల వ్యవధిలో మూడు సార్లు బాలినేనితో సజ్జల భేటీ అయ్యారు.

AP Government Advisor Sajjala Ramakrishna Reddy meets Former minister Sajjala Ramakrishna Reddy

అమరావతి: మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న Balineni Srinivas Reddyతో సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy భేటీ అయ్యారు. నిన్నటి నుండి ఇప్పటివరకు మూడు దఫాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. 

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం పూర్తైన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కూడా వైసీపీకి చెందిన  ప్రజా ప్రతినిధులు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు.  

MLA  పదవికి కూడా రాజీనామా చేయాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి యోచిస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.ఈ ప్రచారం నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్గితో సమావేశం తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత చల్లబడినట్టుగా ప్రచారం సాగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 

అయితే  అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సీఎం YS Jagan ఫోన్ లో మాట్లాడారని చెబుతున్నారు.  ఈ ఫోన్ సంభాషణ పూర్తైన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై  ఆయన అనుచరులు ప్రకాశం జిల్లాలో ఆందోళనకు దిగారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విశ్వరూప్ ప్రమాణం చేశారు.గతంలో కూడా ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios