అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  ఈ వ్యాఖ్యలు మంత్రి కొడాలి నాని వ్యక్తిగతమైనవిగా ఆయన తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలు తప్పని కూడ కొడాలి నానికి అర్ధమై ఉండొచ్చన్నారు.  దేవాలయాలాపై దాడి కుట్రపూరితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

విపక్షాలు ప్రజా సమస్యలపై ధర్నాలు చేసి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరిస్తోన్నందునే కుట్రలు పన్నుతున్నారమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సీఎం  జగన్ చిత్తశుద్దితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.  ఒక వ్యవస్థ కంటే మరో వ్యవస్థ కించపర్చడం సరైంది కాదని ఆయన  చెప్పారు. 

మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్ లో పడ్డారన్నారు. రాజకీయ స్వార్థం కోసం కుట్రలు చేస్తున్నారన్నారు. హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.  రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు.

also read:మోడీపై అనుచిత వ్యాఖ్యలు: కొడాలి నానిని భర్తరఫ్ చేయాలంటూ బీజేపీ ఆందోళన

జగన్ పై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్రీవారికి అత్యంత భక్తిభావంతో సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అమరావతి కుంభకోణం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు రాష్ట్రంలో  హిందూ దేవాలయాలపై దాడుల విషయం తెరమీదికి తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.