రాష్ట్రంలో అవినీతికి కేరాప్ అడ్రస్ అచ్చేన్నాయుడు అని వైసీపి శ్రేణులు ధ్వజం రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిన మొదటి పేరు ఆయనే అని ఆరోపణ. అచ్చేన్నాయుడి పై ధ్వజమెత్తిన వైసీపి నేతలు.
"రాష్ట్రంలో ఏ అక్రమ దందా జరిగినా.. ఆ మంత్రి పేరు వినిపిస్తుంది..." ఆ మంత్రి పై తరుచు ఆరోపణల వినబడుతున్నాయి... ఆ మంత్రి ఆగడాలు తట్టుకోలేక పోతున్నామని సాక్షాత్తు సోదరుడి భార్య, సోదరుడి కూమారుడు స్యయంగా రాతపూర్వకంగా సీఎంకి పిర్యాదు చేశారు, అటువంటి మంత్రి అని వైసీపి నేతలు ధ్వజమెత్తారు. ఇంతకు ఆ మంత్రి ఎవరనుకుంటున్నారా... ఉత్తారాంధ్రంలోని శ్రీకాకుళానికి చేందిన కింజరాపు అచ్చేన్నాయుడు. మంత్రిగా ఆయన సాగించని అవినీతి లేదని వైఎస్సార్‌సీపీ పార్టీ నేత పేరాడ తిలక్ ఎద్దేవా చేశారు. శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేసే రాష్ట్రంలో పలు దందాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
.jpg)
ఇసుక, లిక్కర్ దందాలో బాగా ఆరితేరిన వ్యక్తి మంత్రి అచ్చేన్నాయుడని ధ్వజమెత్తారు తిలక్. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిలో మంత్రి హస్తం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అచ్చేన్నాయుడికి నయీమ్‌తో వ్యవహారాలు కూడా నడిపారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు దందాలు, కబ్జాలు, లిక్కర్ మాఫియాకు, నయీమ్ వంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఎద్దేవా చేశారు.

మంత్రిగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడు.. అవినీతికి అడ్డాగా మారారని విమర్శించారు. కెబినెట్‌లో బి–గ్రేడ్ మంత్రిగా దిగజారిన అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి, లోకేష్‌కి ముడుపులు ఇచ్చి మంత్రి వర్గంలో ప్రమోషన్ కల్పించుకున్నాడని ఆయన దుయ్యబట్టారు.
