టీడీపీ హయాంలో ఒక్క మైనారిటీ నేతకూ కేబినెట్ పదవి దక్కలేదు.. చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్
AP Fisheries minister Sidiri Appala Raju: పలు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలన కాలంలో ఒక్క మైనారిటీ నేతకూ కేబినెట్ పదవి దక్కలేదని ఆరోపించిన ఆయన.. బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే, వైసీసీ అధికారంలోకి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదని తెలిపారు.

Kakinada: గత 75 ఏళ్లుగా బీసీ, ఎస్సీలకు సామాజిక, రాజకీయ సాధికారత కోసం అవకాశం లేకుండా పోయిందని అధికారపార్టీ నాయకుడు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలన కాలంలో ఒక్క మైనారిటీ నేతకూ కేబినెట్ పదవి దక్కలేదని ఆరోపించిన ఆయన.. బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే, వైసీసీ అధికారంలోకి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నదని తెలిపారు. బీసీ, ఎస్సీలకు జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనీ, కానీ చంద్రబాబు పాలన కాలంలో వారు అణచివేతకు గురయ్యారని ఆరోపించారు.
నాలుగున్నరేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు ప్రభుత్వం, వివిధ కార్పొరేషన్లలో ఉన్నత పదవులను అందించే విషయంలో ఇతర కులాల కంటే సమాన ప్రాముఖ్యతను కల్పించారనీ, ఈ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత కల్పించామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క మైనారిటీ నేతకు కూడా కేబినెట్ పదవి దక్కలేదని మంత్రి ఆరోపించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అత్యున్నత అధికారులకు విన్నవించలేదని విమర్శించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు అండగా నిలిచారనీ, ఏ ఒక్క పేదవాడు పేదరికంలో ఉండకూడదని సంకల్పించారన్నారు. 53 నెలల జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక విప్లవకారులుగా మారారనీ, వైకాపా ప్రభుత్వం అణగారిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని మంత్రి గోపాలకృష్ణ అన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపుతున్నప్పటికీ టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు మాత్రం చంద్రబాబు నాయుడు చర్యలను వైట్‌వాష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా చూసేవారని, అయితే జగన్ రెడ్డి వారికి రాజకీయ సాధికారత కల్పించి అనేక ఉన్నత పదవులు అందించారని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 17 మంత్రి పదవులు, నాలుగు రాజ్యసభ స్థానాలు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే ప్రసాద రాజు మాట్లాడుతూ వైకాపా హయాంలో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి రూ.1650 కోట్లు ఖర్చు చేశామన్నారు. నియోజకవర్గంలో 4 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.