బిజెపికి ఇప్పుడు తెలిసొచ్చింది: యనమల ఘాటు వ్యాఖ్యలు

Ap finance minister Yanamala Ramakrishnudu criticises on Bjp
Highlights

బిజెపిపై యనమల హాట్ కామెంట్స్

అమరావతి: ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిన తర్వాత బిజెపికి మిత్రపక్షాల విలువ తెలిసి వచ్చిందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మిత్రపక్షాలను పట్టించుకోకపోతే పుట్టగతులుండవనే భయంతో  మోడీ, అమిత్ షా  నష్టనివారణ చర్యలకు దిగుతున్నారని ఆయన చెప్పారు.


బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోడీ, అమిత్‌షాలు ఇప్పడు మిత్రపక్షాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అహాంకారంతో అద్వానీనీ, మురళీమనోహార్ జోషిని అవమానించారని ఆయన ఆరోపించారు. అద్వానీ, జోషీ ఇళ్ళకు వెళ్ళడంతో పోటు అకాళీదళ్, శివసేన నేతల ఇళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడం  బిజెపి దుస్థితికి నిదర్శనమని యనమల రామకృష్ణుడు చెప్పారు.

ఈవీఎంల ద్వారా ప్రజా తీర్పును కాలరాసేందుకు ప్రయత్నాలు చేశారని యనమల బిజెపి నేతలపై విరుచుకుపడ్డారు. లౌకికవాదం ఎంత ప్రమాదంలో ఉందో  బిషప్‌లే చెప్పారని ఆయన గుర్తు చేశారు. కైరానా ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించి ప్రజలు ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని యనమల అభిప్రాయపడ్డారు.ప్రజలకే కాదు భాగస్వామ్య పక్షాలకు కూడ బిజెపి నమ్మకద్రోహాం చేసిందన్నారు. స్వయంకృతాపరాదం వల్లే బిజెపి మిత్రపక్షాలను కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు.   

loader