అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై చూద్దాం అంటూ చెప్పుకొచ్చారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత విద్యార్థులకు మంచి చదువు అందించాలని, ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నదే లక్ష్యమన్నారు. ప్రాధాన్యతల ప్రకారం పనులు చేసుకుంటూ పోతామన్నారు. 

అంతేకానీ విద్యను, వైద్యాన్ని ప్రజలను వదిలేసి రాజధాని నిర్మాణంపై పడలేమన్నారు. తమకు కూడా పారిస్, లండన్ లా రాజధాని అమరావతిని నిర్మించాలని ఉందని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదు కదా అన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

2014లో చంద్రబాబుకు జగన్ ధైర్యం చెప్పారు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

చంద్రబాబు పాలన గడ్డుకాలం: ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన