ఎవొబి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం ఉంటుంది :మావోయిస్టు పార్టీ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు అడియో విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులనుంచి బెదిరింపులు వస్తూ ఉండటంతో మంత్రులకు, ఇతర అధికార పార్టీ, బిజెపి నేతలకు భద్రత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు, సంక్షేమ శాఖ రావెల కిశోర్ బాబులకు భద్రత పెంచారు. మంత్రుల ఇళ్ల దగ్గర కూడా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
అభద్రత రీత్యా సమాచారం ఇవ్వకుండా నాయకులు పర్యటన సాగించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్ కౌంటర్ తర్వాత కూడా తమ పార్టీ ఇంకా కొనసాగుతూ ఉంటుందని చెప్పేందుకు మావోయిస్టుల దాడులకు పాల్పడవచ్చనిపోలీసుల అనుమానిస్తున్నారు.
ఏజన్సీ ప్రాంతాలతో, మావోయిస్టుల కదలికలుండే ఇతర ప్రాంతాలలో ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను కేటాయిస్తున్నారు. కొంతమంది ప్రతిపక్ష శాసన సభ్యులకు కూడా భద్రత పెంచే అవకాశం లేకపోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. మావోయిస్టు చరిత్రలోనే పెద్ద ఎన్ కౌంటర్ కావడంతో పర్యవసానాలుతప్పని సరిగా ఉంటాయని అంతా అనుమానిస్తున్నారు. అప్రమత్తం అవుతున్న పోలీసులు మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై నిఘా పెంచారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం నల్లమలలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ పార్టీ కి పట్టు ఉన్న ప్రాంతాలన్నింటా ప్రత్యేక బలగాలను రంగంలో దింపుతున్నారు.ఇది ఇలా ఉంటే, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు కైలాసం శుక్రవారం ’ఎన్ కౌంటర్’ ను విద్రోహచర్యగా వర్ణించారు. ఎన్ కౌంటర్ కుసంబంధించిన10 ని అడియో ను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ విద్రోహం వల్ల అనేక మంది సీనియర్ నేతలను పార్టీ కోల్పోయిందని, అలాగే కొంతమంది సాధారణ పౌరులను కూడా ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆయన అంగీకరించారు.
ఇది బూటకపు ఎన్ కౌంటర్ గా చెబుతూ పార్టీ తమ అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఈ పోలీసు చర్యలకు తప్పనిసరిగ్గా ఉంటుందని ఆయన చెప్పారు. ఒడిశా పోలీసుల నిఘా వర్గాల సహకారంతో ఆంధ్రపోలీసులు ఏకపక్షంగా కాల్పులకు పూనుకున్నారని కైలాసం చెప్పారు. ఎన్ కౌంటర్ లో సాధారణ పౌరులు కూడా మరణించారని చెప్పారు. మరికొంత సమాచారన్ని త్వరలో చెబుతానని అన్నారు.
