Asianet News TeluguAsianet News Telugu

ఎలైట్ ఎగ్జిట్ పోల్ సర్వే: టీడీపీదే విజయం

హైదరాబాద్ కు చెందిన ఎలైట్ ఎలక్ట్రోరల్ కాలుక్యులస్ లిమిటెడ్ సంస్థ ఏపీలో ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కానున్నట్లు ప్రకటించింది. 

ap exit poll results 2019 : elite electoral exit poll results
Author
Hyderabad, First Published May 19, 2019, 6:08 PM IST

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన ఎలైట్ ఎలక్ట్రోరల్ కాలుక్యులస్ లిమిటెడ్ సంస్థ ఏపీలో ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కానున్నట్లు ప్రకటించింది. 

ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. సైతం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోస్ట్ పోల్ సర్వేలు నిర్వహించిన ఈ సంస్థ ఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది.  

ఎలైట్ ఎలక్ట్రోరల్ కాలుక్యులేషన్ లిమిటెడ్ సంస్థ సర్వే వివరాలు

1. 2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:

వ.నం     పార్టీ పేరు                                 గెలిచేస్థానాల సంఖ్య   పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.          తెలుగుదేశం                                       106                             5

2.        వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ                      68                               5

3.       జనసేన పార్టీ                                         1                                 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

2. 2019 ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:

వ.నం           పార్టీ పేరు                              గెలిచే స్థానాల సంఖ్య                పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.               తెలుగుదేశం                                   17                                               1

2.               వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ                  8                                               1

3.              జనసేన పార్టీ                                     0                                                0
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios