Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాల విడుదల: చందన్ విష్ణు వివేక్‌కి ఫస్ట్ ర్యాంక్


ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం నాడు విడుదల చేశారు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చందన్ విష్ణు వివేక్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాసకార్తికేయ రెండో ర్యాంక్ దక్కించుకొన్నాడు. 

AP EAPCET Result 2021 for Agriculture and Pharmacy results Declared
Author
Guntur, First Published Sep 14, 2021, 11:24 AM IST

అమరావతి:ఈఏపీసెట్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  మంగళవారం నాడు విడుదల చేశారు. 92.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది 72,488 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి సురేష్ చెప్పారు.

 

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 83,822 మంది విద్యార్థులు  ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే పరీక్షకు మాత్రం 78,066 మంది మాత్రమే హారయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో  72,488 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.ఈ నెల 8వ తేదీన ఇంజనీరింగ్ విభాగం ప్రవేశపరీక్ష ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చందన్ విష్ణు వివేక్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాసకార్తికేయ రెండో ర్యాంక్ దక్కించుకొన్నాడు. హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాన్ రావుకి మూడో ర్యాంక్, హైద్రాబాద్ కు చెందిన గజ్జల సమీహనరెడ్డికి నాలుగో ర్యాంక్, కాసా లహరికి ఐదో ర్యాంకు దక్కిందని మంత్రి సురేష్ వివరించారు.రేపటి నుండి ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

గుంటూరుకు చెందిన కాశీందుల చైతన్యకృష్ణకు ఆరో ర్యాంకు, గుంటూరులోని గోరంట్లకు చెందిన నూతలపీటి దివ్య, ఎనిమిదో ర్యాంకును సిద్దిపేటకు చెందిన కళ్యాణం రాహుల్ సిద్దార్ధ్, నల్గొండకు చెందిన సాయిరెడ్డి తొమ్మిదో ర్యాంకు, గుంటూరుకు చెందిన గద్దె విదీప్ పదో ర్యాంకు సాధించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios