Asianet News TeluguAsianet News Telugu

ఏపీ జిల్లాల విభజన: రానున్న రోజుల్లో విశాఖ ఎన్ని ముక్కలంటే....

అన్ని జిల్లాల్లో కెల్లా విశాఖ జిల్లా పరిస్థితి అన్నిటికంటే భిన్నంగా కనబడుతుంది. విశాఖ జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు, అనకాపల్లి, విశాఖ. ఇందిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వేరే జిల్లాకు చెందిన ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

AP Districts Delimitation: Visakhapatnam To Be Made Into 4 Parts
Author
Visakhapatnam, First Published Jul 17, 2020, 6:30 PM IST

జగన్ నూతన జిల్లాల ఏర్పాటు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా అన్నప్పటికీ.... అది సాధ్యపడేలా కనబడడంలేదు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ జిల్లాలకు చెందిన ప్రాంతాలుండడం, వాటి భౌగోళిక పరిస్థితులు కూడా విభిన్నంగా ఉండడంతో కొత్త జిల్లాల సంఖ్యా 25ను దాటేలా కనబడుతుంది. 

అన్ని జిల్లాల్లో కెల్లా విశాఖ జిల్లా పరిస్థితి అన్నిటికంటే భిన్నంగా కనబడుతుంది. విశాఖ జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు, అనకాపల్లి, విశాఖ. ఇందిలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వేరే జిల్లాకు చెందిన ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీనితో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అభివృద్ధి చెందిన నగరం, మైదాన ప్రాంతం, తీర ప్రాంతం, ఏజెన్సీ, కొండప్రాంతం వీటన్నిటి కలయికే విశాఖ జిల్లా. అన్ని జిల్ల్లా మాదిరి ఇక్కడ సాధారణముగా విభజిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. జిల్లా చివర్లో ఉన్న ప్రాంతం నుంచి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే కొండాకోనలను ధాటి దాదాపుగా 6 గంటల సమయం ప్రయాణం చేయవలిసి ఉంటుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాను నాలుగు ముక్కలు చేయాలనీ యోచిస్తోంది ప్రభుత్వం. ముందుగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుంటే... విశాఖ పార్లమెంటు పరిధిలో శృంగవరపుకోట విశాఖ నగరానికి దూరంగా ఉంటుంది. విశాఖ కన్నా శృంగవరపుకోట నుంచి విజయనగరం దగ్గర. కాబట్టి ఆ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా పరిధిలోనే ఉంచాలనే యోచన కనబడుతుంది. 

ఇక అనకాపల్లి విషయానికి వస్తే పెందుర్తి, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం,మాడుగుల,చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల సంహారంగా ఉంది. పెందుర్తి నియోజకవర్గంలోని ప్రాంతాలు అనకాపల్లి కన్నా విశాఖకు దగ్గర్లో ఉంటాయి. కాబట్టి వీటిని విశాఖ పరిధిలోనే ఉంచే అవకాశాలున్నాయంటున్నారు. 

ఇక అరకు నియోజకవర్గం విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు పాడేరులను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. డిప్యూటీ సీఎం పాములా పుష్పశ్రీవాణి కూడా అరకు నియిజికవర్గాన్ని రెండు జిల్లాలుగా చేయమని కోరిన విషయం తెలిసిందే. 

కురుపాం, పార్వతీపురం మిగిలిన గిరిజన గ్రామాలను కలిపి మరో జిల్లాగా కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రాథమికంగా ఈ విభజన గురించిన వార్తలు మాత్రమే ఇవి. దీనిపైన మరికొన్ని కసరత్తులు  ఉంది ధర్మాన వంటివారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు విజయనగరం పరిధిలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఇవి ఎలాంటి 

Follow Us:
Download App:
  • android
  • ios