Asianet News TeluguAsianet News Telugu

అరకు ఘటనకు మేమే బాధ్యత వహిస్తాం: డీజీపీ ఠాకూర్

అరకులో మావోయిస్టులు చర్యకు తామే బాధ్యత వహించాలని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు హతమార్చిన లిపిటిపుట్టు ప్రాంతాన్ని డీజీపీ పరిశీలించారు. 
 

ap dgp rp takur comments on araku maoists attack
Author
Visakhapatnam, First Published Sep 26, 2018, 4:44 PM IST

విశాఖపట్నం: అరకులో మావోయిస్టులు చర్యకు తామే బాధ్యత వహించాలని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోలు హతమార్చిన లిపిటిపుట్టు ప్రాంతాన్ని బుధవారం డీజీపీ పరిశీలించారు. 

మావోయిస్టులు సర్వేశ్వరరావు, సోమలను చంపడం బాధాకరమన్నారు. అయితే ఘటనకు తామే బాధ్యత వహిస్తామని తెలిపారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు. 

రామగూడ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారని చాలా సార్లు ప్రతికార చర్యలకు ప్లాన్ చేశారని డీజీపీ తెలిపారు. ఏడు సార్లు పోలీసులు మావోయిస్టుల ప్రతీకార చర్యల నుంచి తప్పించుకున్నారని స్పష్టం చేశారు. 

మావోయిస్టుల దాడికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీఎమ్మెల్యే సివేరి సోమలను ఎందుకు హతమార్చారో దర్యాప్తులో తేలుతుందన్నారు. 

హత్యలపై మావోయిస్టుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని తెలిపారు. అయితే ఏవోబీలో ఒడిస్సా-ఆంధ్రా పోలీసుల మధ్య సమన్వయ లోపం ఉందన్నది వాస్తవమేనన్నారు. కేంద్రబలగాలు, ఆంధ్రా,ఒడిస్సా పోలీసులు భవిష్యత్ లో అంతా కలిసి పనిచేస్తామని తెలిపారు. 

ఘటనకు సంబంధించి దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతుందని, దీనికి సంబంధించి డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఒడిస్సా నుంచి వచ్చి మావోయిస్టులు హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

Follow Us:
Download App:
  • android
  • ios