Atmakur Attack : మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలే ప్రసక్తే లేదు: డీజీపీ గౌతమ్ సవాంగ్
Atmakur Attack Incident: కర్నూలు జిల్లా ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే తేల్చి చెప్పారు.
Atmakur Attack Incident: కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమైన భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఆత్మకూరులోని పద్మావతి పాఠశాల వెనకాల మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఓ వర్గంవారు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. దీంతో ఆత్మకూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో కొంతమంది కావాలనే మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై దాడి, తదనంతర పరిణామాలపై డీజీపీ సీరియస్ అయ్యాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఆత్మకూరులో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆత్మకూరు సంఘటన ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు. ఈ ఘటన పై దర్యాప్తు ఆదేశించారు.
కాగా, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ‘‘కర్నూలుజిల్లా ఆత్మకూర్ పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న నిర్మాణాలను ప్రజలతో కలసి ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి , జై చంద్రల పై హత్యాయత్నాన్ని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండించారు. ప్రజలపైన రాళ్ళు దాడి చేయడమమే కాకుండా పోలీసుల సమక్షంలో నేతల వాహనాలను ద్వంశం చేయడం సిగ్గుచేటు . సంఘటనకు కారులైన వారిపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని బాధితులకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తుంది. ’’ అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.