Asianet News TeluguAsianet News Telugu

అవాస్తవాలతో లేఖలు: చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్

ఏదైనా ఘటన జరిగితే అవాస్తవాలతో తనకు లేఖలు రాస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ap Dgp gautam sawang sensational comments on Chandrababunaidu lns
Author
Amaravathi, First Published Oct 14, 2020, 3:40 PM IST


అమరావతి:ఏదైనా ఘటన జరిగితే అవాస్తవాలతో తనకు లేఖలు రాస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారినపై చర్యలు తీసుకొన్నామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ అభ్యున్నతికి సహకార సంఘాన్ని ప్రారంభించినట్టుగా ఆయన  చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నూతన సాంకేతిక మార్పులు  తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.

సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోందన్నారు.సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టినట్టుగా ఆయన చెప్పారు.అసాంఘిక శక్తులపై పోలీస్ నిఘా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకొంటామని డీజీపీ హెచ్చరించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios