Asianet News TeluguAsianet News Telugu

నిందితుల్ని వదలిపెట్టేది లేదు.. ప్రతి మహిళా దిశా యాప్ వాడాలి: అత్యాచార ఘటనపై ఏపీ డీజీపీ స్పందన

కృష్ణానదీ తీరంలో యువతిపై అత్యాచార ఘటనపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు. 

ap dgp gautam sawang comments on sitanagaram gang rape case ksp
Author
Amaravathi, First Published Jun 21, 2021, 12:38 PM IST

కృష్ణానదీ తీరంలో యువతిపై అత్యాచార ఘటనపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు.

Also Read:యువతిపై గ్యాంగ్ రేప్ : న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.. జగన్ పై లోకేష్ ఫైర్..

ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత తమ ప్రథమ కర్తవ్యమని ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. మరోవైపు సీతానగరం ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేస్తోంది. తాడేపల్లి రౌడీషీటర్ల నుంచి పోలీసులు ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios