యువతిపై గ్యాంగ్ రేప్ : న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.. జగన్ పై లోకేష్ ఫైర్..
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం మీద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం మీద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ! మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా టిడిపినేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారు.
ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అంటూ ప్రశ్నించాడు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ప్రేమ జంటపై దాడి చేసి యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.
ప్రియుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: నిందితుల కోసం పోలీసుల వేట...
తాడేపల్లి మండం పరిధిలోని సీతానగరంలో గల పుష్కరఘాట్ వద్ద ప్రేమికులపై నలుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేశారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్టుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అత్యాచారానికి గురైన యువతిని పోలీసులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్లేడ్ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.