చంద్రబాబును చంపితే భువనేశ్వరినే చంపాలి..: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చంపితే ఆయన సతీమణి భువనేశ్వరే చంపాలని అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చంపితే ఆయన సతీమణి భువనేశ్వరే చంపాలని అని అన్నారు. తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న చరిత్ర భువనేశ్వరిదని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పదవీకాంక్ష పట్టుకుందని ఆరోపించారు. అందుకే భువనేశ్వరి కొడుకు కోసం భర్తకు అన్నంలో ఏమైనా కలిపి చంపే ప్రయత్నం చేస్తుందనే అనుమానం ఉందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని చెప్పడానికి భువనేశ్వరి ఏమైనా డాక్టరా? అని ప్రశ్నించారు.
టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఏ పార్టీ అనేది అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప ఏమి కనిపించడం లేదని అన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రి మోదీనే మాట్లాడారని.. కానీ పురందేశ్వరి మాత్రం వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.