వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిపై జగన్, పవన్‌లకు కనీసం అవగాహన లేదని.. జగన్ వీధుల్లో తిరుగుతుంటే... పవన్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని అసత్యాలు ప్రచారం చేశారని.. టీడీపీ అధినేత యూ టర్న్ తీసుకున్నారని అనడం దారుణమని.. హామీలు నెరవేరుస్తామని తమను మోసం చేసి ఇలా విమర్శించడం దారుణమని.. అసలు యూటర్న్ తీసుకుంది చంద్రబాబు కాదని నరేంద్రమోడీనే అని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీ ధర్మపోరాటం ఆగదని.. ఇచ్చిన హామీలు నెరవేరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఎంత దూరమైనా వెళతామని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేఈ సవాల్ విసిరారు.