‘రమణ దీక్షితులు చాలా తప్పులు చేశారు’

ap deputy cm ke krishna murthy fire on tirumala preist ramana dekshithulu
Highlights

తిరుమల ప్రధాన అర్చకునిపై కేఈ ఆరోపన

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు ఆరోపణలు చేశారు. ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారన్నారు. సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ఏడుకొండల గురించి గతంలో చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని.. రమణ దీక్షితులు గతంలో చేసిన తప్పులపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి నగలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అధికారులు వాటిని ఏటా పరిశీలిస్తారని కేఈ తెలిపారు. 

రమణ దీక్షితులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

loader