Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా కు కరోనా సోకింది. ఆయనతోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా కరోనా పాజిటివ్ గా తేలారు. 

AP Deputy CM Amzath Basha Tests Positive For Coronavirus
Author
Tirupati, First Published Jul 13, 2020, 8:17 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ నానాటికి ఎక్కువవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా కు కరోనా సోకింది. ఆయనతోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా కరోనా పాజిటివ్ గా తేలారు. 

శుక్రవారం అర్థరాత్రి వారు కడప నుండి తిరుపతి స్విమ్స్ కు చేరుకున్నారు. అక్కడ వారికి ప్రత్యేక గదిని కేటాయించి చికిత్సను అందించామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, వారు ఆదివారం హైదరాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లారని స్విమ్స్ వైద్యులు తెలిపారు. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో (మొన్న ఉదయం నుండి నిన్న ఉదయం వరకు)1,933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 29,168కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాతో 328 మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కరోనా సోకినప్పటికి 15,412 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 13,428  యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా  ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.

గత 24 గంటల్లో 17,624 శాంపిల్స్ పరీక్షిస్తే 1933 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఒక్క రోజులోనే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 18 మందికి, విదేశాల నుండి వచ్చిన ఒక్కరికి కరోనా సోకినట్టుగా ఏపీ సర్కార్ తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 11,53,849 మంది శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలోని 13,428 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో 3405 మందికి కరోనా సోకింది. అనంతపురంలో 3290, గుంటూరులో 3019, చిత్తూరులో 2668, తూర్పుగోదావరిలో 2642 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కర్నూల్ లో నలుగురు, కృష్ణా,విశాఖపట్టణంలో ముగ్గురేసి చొప్పున, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios