అమరావతి:  టీటీడీ బంగారం తరలింపులో లోపాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు.

బుధవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.  టీటీడీపీ బంగారం తరలింపు విషయమై మన్మోహన్ సింగ్ నివేదికను అందించినట్టుగా సీఎస్ తెలిపారు.

ఈ నివేదికను ముఖ్యమంత్రికి పంపనున్నట్టు ఆయన చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటామన్నారు. పెద్ద ఎత్తున బంగారం తరలింపులో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బంగారం తరలింపు వ్యవహరంలో  టీటీడీ అధికారులు, బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అబిప్రాయపడ్డారు. శ్రీవారి బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయా శాఖల సమీక్షలు నిర్వహిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కొడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు కోడ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.