ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో పుంగనూరు, మాచర్లలో ఏకగ్రీవాలపై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. అరగంట పాటు ఈ సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది.

మూడో విడతలో13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా... ఫిబ్రవరి 17న 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. సర్పంచ్ పదవులకు బరిలో 7756 మంది నిలిచారు.