Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రలో ఇక అంతా సబ్ కలెక్టర్ల పాలన

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ రెవిన్యూ సంస్కరణ చేపడుతున్నారు
  • ఐఎఎస్ కలెక్టర్ అధికారాలు తగ్గి, రాష్ట్ర అధికారి అర్డీవో కి ప్రాముఖ్యం
  • రాజకీయ పెత్తనానికి దారి తీస్తుందా లేక కొత్త అధ్యాయం ఆరంభమా
ap collectors to lose their sheen

కొత్త జిల్లాల ఏర్పాటు జోలికి వెళ్లకుండా పరిపాలనను వికేంద్రీకరించేందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం పునర్వ్యవస్థీకరణ పూనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణాలో  పరిపాలనను ప్రజలకు దగ్గరకు తీసుకుపోయేందుకు పెద్ద జిల్లాలకు చిన్నచిన్న జిల్లాలుగా విడగొడితే,  ఆంధ్రప్రదేశ్ పునర్వ్య స్థీకరణ మరొక విధంగా జరగుతుూ ఉంది.  ఇపుడున్న కలెక్ట ర్ల అధికారాలలో కొన్నింటిని డివిజన్ స్థాయి అధికారులకు అంటే ఆర్డీవోలకు  బదలాయించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

 

మొత్తానికి తెలుగు రాఫ్ట్రాలలో మొట్ట మొదటి సారి  125  సంవత్సరాల నుంచి జిల్లానవాబుగా ఉంటూ వస్తున్న  ’కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ’ కార్యాలయం మసకబారుతున్నది. తెలంగాణాలో కలెక్టర్  ఇపుడు పాత రెవిన్యూడివిజన్ సమానమయిన  ప్రాంతానికి కుదించుకుపోతే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకువస్తున్న సంస్కరణలలో భాగంగా  కలెక్టర్ తన అధికారాలను కొన్నింటిని ఆర్డీవోలకు వదలుకోవలసివస్తుంది. ఈ మార్పుల  ప్రకారం అర్డివో పేరు సబ్ కలెక్టర్ గా మార్చే అవకాశం ఉందని ఈ మార్పులలో పాలుపంచుకున్న అధికారి  ఒకరు ఏషియానెట్ కు చెప్పారు. మామూలుగా ఐఎఎస్ అధారిని రెవిన్యూ డివిజన్లో  నియమించినపుడు సబ్ కలెక్టర్ గా పిలుస్తారు.అయితే,  ఇపుడు రెవిన్యూ డివిజన్ మిని కలెక్టరేట్ కానున్నందున ఆర్డివొ లను కూడా సబ్ కలెక్టర్ అని నామకరణం చేయనున్నారు.

పాలన వ్యవహారాలలో బాగా అనుభవం ఉండి,  ఇప్పటి సంస్కరణలో  భాగస్వామి అయిన  ఒక స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చెప్పిందాని ప్రకారం, జిల్లా కలెక్టర్ జిల్ల ా చీఫ్ సెక్రెటరీలాగా పని చేస్తారు.

’ ప్రతి రెండు నియోజకవర్గాలకు  ఒక రెవిన్యూ డివిజన్  ఉంటుంది.  ప్రతి డివిజన్లో పది మండలాలుంటాయి. ఈ లెక్క న 175 అసంబ్లీ నియోజకవర్గాలకు 79 రెవిన్యూ డివిజన్లు  ఏర్పాటవుతాయి. అంటే ఇపుడున్న్ 49 రెవిన్యూ డివిజన్లకు అదనంగా మరొక 30 రెవిన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇలాగే డిఎస్ పి ల సంఖ్యను కూడా పెంచుతారు,’ అని ఆయన చెప్పారు.

ఇక ముందు ప్రభుత్వం పథకాల మంజూరు చేయడానికి గాని, పథకాల అమలు పర్యవేక్షణకు గాని జిల్లా యూనిట్ కాకుండా డివిజన్ యూనిట్ గా మారుతుందట. ఇప్పటివరకూ  ఆర్‌డీవోల పాత్ర  చాలా పరిమితం.  ఇపుడ ఆర్డీవోల అధికార పరిధిని విస్తృతం చేయాలనుకుంటున్నారు.ఇపుడు జిల్లా పాలనా బాధ్యత అంతా కలెక్టర్ చూస్తున్నారు. పథకాలు అమలు తీరును ఇతర  కార్యక్రమాల పర్యవేక్షణ కలెక్టరే  పర్యవేక్షిస్తారు. 


యోచిస్తున్న కొత్త విధానం ప్రకారం  ఇకపై ఆర్‌డీవోలు రెవెన్యూ డివిజన్‌లో  జిల్లా కలెక్టర్ లాగా పరిపాలనసాగిస్తారు. పర్యవేక్షణ చెస్తారు. దీనిని పర్యవసానం ఎలా ఉంటుంది.  కలెక్టర్ అఖిల భారత స్థాయి ఉద్యోగి కాబట్టి చాలా సందర్బాలలో రాజకీయ నాయకులు జోక్యాన్నిధైర్యంగా నియంత్రించే వారు.  రాజకీయ నాయకులను అమడ దూరంలో ఉంచి కేవలం ప్రజా సంక్షేమం కోసం పని చేసిన కలెక్టర్లు కూడా ఉన్నారు. గతంలో కొంతమంది కలెక్టర్లను అకాలంగా బదిలీ చేసిన సందర్భాలలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

అయితే, డిప్యూటి కలెక్టర్ అనేది రాష్ట్ర సివిల్ సర్వీస్ పరిధిలోనిది.  డిప్యూటి కలెక్టర్ల, డిఎస్ పిల  పోస్టింగ్ లు చాలా వరకు రాజకీయ వత్తిళ్లతో  జరుగుతుంటాయి. ఈ స్థాయిలో కూడా నిస్వార్థంగా , రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఆదర్శవంతులు లేరని కాదు, వారి సంఖ్య బాగా తక్కువ. అలాంటి వాళ్లను రెవిన్యూ సర్వీస్ నుంచి తీసేసి ప్రాముఖ్యం లేని పోస్టులలో వేసేస్తుంటారు. ఇపుడున్న  రాజకీయ వ్యవస్థలో నిజాయితీ తో పనిచేసే అధికారులు ఏదో మూలన పడి ఉంటారు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్న ఈ సంస్కరణలు ఎలాంటి  పరిణామాలకు దారితీస్తాయోననే అనుమానం రాకమానదు.


 కొత్త సంస్కరణల ప్రకారం వీలైనంతవరకూ నిర్ణయాలు రెవెన్యూ డివిజన్‌లోనే జరిగిపోయేలా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం అరవై రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి. జిల్లాలకు బదులు కొత్త రెవిన్యూ డివిజన్లను సృష్టించడమే మేలని సిఎం అనుకుంటున్నట్లు తెలిసింది.  జిల్లా స్థాయిలో ఉండే అన్ని ప్రభుత్వ, సంక్షేమ, ఇంజనీరింగ్‌ తదితర శాఖల కార్యాలయాలు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో లో కూడా ఉంటాయి. ఆర్ డివొ పర్యవేక్షణలో ఉంటాయి. 
 

 కొత్త వ్యవస్థ అమలులోకి రాాగానే ముఖ్యమంత్రి ఏడాది రెండు సార్లు రెవిన్యూడివిజన్ అధికారులతో రెండు రోజుల సదస్సు నిర్వహిస్తారు. ఇపుడు కలెక్టర్ ల సద స్సు మాత్రమే జరగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios