ఉద్రిక్తతల నడుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు అధికారులు, మంత్రులు, వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో ఆయన తిరుమలకు బయల్దేరారు. మరికొద్దిసేపట్లో సీఎం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు అన్నమయ్య భవన్ నుంచి జగన్ ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

అనంతరం రాత్రి 7.30 గంటలకు గరుడ వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేస్తారు. రేపు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకుని, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నిర్మాణ భూమి పూజలో పాల్గొంటారు.