ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న బండ్ల లాగుడు పోటీల్లో ఆయన పాల్గొన్నారు.

Also Read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

తాడేపల్లి నుంచి గుడివాడ చేరుకున్న ఆయనకు మంత్రి నాని, అధికారులు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎండ్ల బండ్ల పోటీలను సీఎం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా నానితో కలిసి జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలాను సీఎం తిలకించారు. అంతకుముందు ఆయన చిన్నారులపై భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు.  అంతకుముందు ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:రంగంలోకి నందమూరి సుహాసిని: అమరావతిపై వ్యాఖ్యలు ఇవీ...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని జగన్ ట్వీట్ చేశారు.