అమరావతి: ఆందోళనకు దిగిన అమరావతి రైతులకు మద్దతుగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని రంగంలోకి దిగారు.  అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 28వ రోజుకు చేరుకుంది. 

మందడంలో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలో నందమూరి సుహాసిని పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుందని ఆమె చెప్పారు. 

అమరావతి నుంచి రాజధానిని మార్చడం ఎవరి వల్ల కూడా కాదని సుహాసిని అన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చునని ఆమె అననారు. 

ఏ రాష్ట్రానికి అయినా రాజధాని ఒక్కటే ఉంటుందని, మహిళలపై జరిగిన దాడులను తాను ఖండిస్తున్నానని ఆమె అన్నారు.