వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అల్లూరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను పరామర్శించి , ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడీ అయ్యారు. రెండ్రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో సీఎం సమావేశమవుతారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ :
- సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయల్దేరతారు
- 10.30 గంటలకు అల్లూరి జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి చేరుకుంటారు
- 11 గంటలకు స్థానిక బస్టాండ్ వద్ద కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధిత కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు
- మధ్యాహ్నం 2 గంటలకు కుక్కునూరు మండలం గుమ్ముగూడెం గ్రామానికి జగన్ చేరుకుంటారు
- 20 నిమిషాల పాటు గ్రామంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు
- సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని .. పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే ముఖ్యమంత్రి బస చేస్తారు.
- మంగళవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ మండలం ముమ్మిడివరం మండలం గురజపులంకకు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు
- అనంతరం రామాలయంపేట గ్రామం సమీపంలోని తానేలంక చేరుకుని.. ఐనవిలల్లి, తోటరాముడివారి పేటలకు చెందిన బాధితులను సీఎం పరామర్శిస్తారు
- మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్ తాడేపల్లి తిరిగి బయల్దేరి వెళతారు
