ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి పాదాభివందనం చేయబోయారు.

విమానం నుంచి కిందకి దిగి వస్తున్న మోడీకి జగన్ గులాబీతో స్వాగతం పలికారు. ప్రధానిని చూడగానే సీఎం నడుం వంచేశారు. ఒకసారి కాదు రెండు సార్లే జగన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా.. ప్రధాని వాద్దని వారించారు.

అనంతరం ఏదో మాట్లాడి భుజం తట్టారు. అప్పటికీ జగన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వరుసగా తన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలను ప్రధానికి పరిచయం చేశారు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.