ఇవాళ రాత్రే ఢిల్లీకి జగన్: 9 గంటలకు ప్రత్యేక విమానంలో హస్తినకు సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రికే  ఢిల్లీకి బయలుదేరుతారు.  ఇవాళ సాయంత్రం  జగన్  ప్రయాణించిన  విమానంలో  సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జగన్  ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది

AP CM YS Jagan  To leave for  Delhi  today night 9


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్   సోమవారం నాడు రాత్రి  9:00 గంటలకు  ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.  ఇవాళ  సాయంత్రం ఐదు గంటలకు  ఢిల్లీకి బయలుదేరినప్పటికీ   సీఎం ప్రయాణించిన విమానంలో  సాంకేతిక సమస్య తలెతల్లింది. దీంతో  ఈ విమానం 24 నిమిషాల తర్వాత  తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.  

గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సీఎం జగన్  తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరకున్నారు.  రేపు ఢిల్లీలో జరిగే  సమావేశం  ఏపీ ప్రభుత్వానికి అత్యంత  ముఖ్యమైంది. దీంతో  ఇవాళ రాత్రికే  ఢిల్లీకి చేరకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు.  దరిమిలా  మరో ప్రత్యేక విమానాన్ని  సీఎంఓ అధికారులు సిద్దం  చేశారు. రాత్రి  9:00 గంటలకు సీఎం జగన్  ఢిల్లీకి వెళ్లనున్నారు. 

రేపు ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  జరుగుతుంది.ఈ సమావేశంలో  ఏపీ సీఎం జగన్  పాల్గొంటారు. రేపు ఉదయం  10 గంటలకు  ఈ సమావేశం  ప్రారంభం కానుంది .  సాయంత్రం వరకు  ఈ సమావేశం సాగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత  సీఎం జగన్  అమరావతికి చేరుకుంటారు. 

also read:సీఎం జగన్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్:24 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం గుర్తింపు

 ప్రపంచంలోని  పలు దేశాల నుండి  పెద్ద ఎత్తున ఈ సమావేశానికి  ప్రతినిధులు హజరు కానున్నారు. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై  ఈ సమావేశంలో  ఏపీ ప్రభుత్వం  వివరించనుంది.  పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం  ఇచ్చే రాయితీల వంటి అంశాలను  ప్రభుత్వం  వివరించనుంది.రేపు ఉదయం తాడేపల్లి నుండి  సీఎం జగన్  ఢిల్లీకి వెళ్తారని  ఏపీ ప్రభుత్వ వర్గాలు  ప్రకటించాయి.  అయితే  రాత్రికే  సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారని  ఎంపీ మిథున్ రెడ్డి  ప్రకటించినట్టుగా  ఓ తెలుగు న్యూస్ చానెల్ ప్రకటించింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios