Asianet News TeluguAsianet News Telugu

నా పిల్లల మీద పెడుతున్నపెట్టుబడే ఇవన్నీ...: విద్యారంగంపై మేదోమధనంలో జగన్

వైసిపి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తిచేసుకున్న సందర్భంగా వివిద శాఖల్లో తీసుకువచ్చిన మార్పులపై ముఖ్యమంత్రి జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విద్యావ్యవస్థపై మేధోమదనం జరిపారు. 

AP CM YS Jagan Special Meeting on Education Department
Author
Amaravathi, First Published May 27, 2020, 1:25 PM IST

తాడేపల్లి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేధావులు, విద్యార్థులతో చర్చించారు. వైసిపి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తిచేసుకున్న సందర్భంగా వివిద శాఖల్లో తీసుకువచ్చిన మార్పులపై ముఖ్యమంత్రి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విద్యావ్యవస్థపై మేధోమదనం జరిపారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ...''పేదవాడికి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేసేది చదువు ఒక్కటేనని అన్నారు. అయితే అమ్మఒడికి, నాడునేడు, వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలకు ఇంత పెద్దఎత్తున ఖర్చు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది నా పిల్లల మీద పెట్టే పెట్టుబడి మాత్రమే అని వారికి సమాధానం ఇచ్చాను'' అని తెలిపారు. 

''2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత 33శాతం. కానీ దేశం యావరేజ్ 23 శాతమే. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ పథకాలన్నీ తీసుకువచ్చి విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తున్నాం'' అన్నారు. 

''పైచదువుల విషయంలో మన దేశ పరిస్థితి బ్రిక్స్ దేశాలతో కంపేర్ చేసుకుంటే GER చాలా ఘోరంగా వుంది. రష్యాలో 84, బ్రెజిల్ 51 శాతం, చైనాలో  51 ఎన్ రోల్ వుంటే మనదేశంలో కేవలం 25.8  శాతం మాత్రమే ఎన్ రోల్ అవుతున్నారు. 74 శాతం మంది పైచదువులు ఆపేస్తున్నారు. వారు ఇలా మధ్యలోనే చదువులు ఆపడం చదవడం ఇష్టం లేక కాదు  తల్లిదండ్రులకు కెపాసిటీ లేకే. ప్రతి దగ్గర ఇదే పరిస్థితి వుంది'' అని తెలిపారు. 

''నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నపుడు గోపాల్ అనే వ్యక్తిని కలిశా. అతడు తన కొడుకు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో బాధపడుతూ తెలిపాడు. బాగా చదువుతున్నాడని అప్పుచేసి మరీ ఇంజనీరింగ్ చదివిస్తుండగా....ఆ అప్పుల గురించి తెలిసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఇది ఒక్క గోపాల్ పరిస్థితే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పేదవాడి పరిస్థితి'' అని సీఎం వివరించారు.  

read more   ప్రభుత్వం దివాళా తీసిందా?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న

''పేదవాళ్లను పేదరికం నుండి బయట పడేసేది విద్యే. పిల్లలను చదివించలేకపోతే పేదవాడిగానే మిగిలిపోతారు... పేదరికానికి వున్న ఏకైక పరిష్కారం చదువు ఒక్కటే'' అన్నారు. 

'' రాష్ట్రంలోని 45వేల తెలుగుమీడియం ప్రభుత్వ పాఠశాలలు వున్నారు. వీటిల్లో కనీసం బాత్రూంలు కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఈ వ్యవస్థలో మార్పుల కోసం శ్రీకారం చుట్టాం. ఇంగ్లీష్ మీడియం దిశగా ప్రభుత్వం పాఠశాలలను తీసుకువెళుతున్నాం. ఇందుకోసం అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీల ఏర్పాటు చేసి వారిని అడిగాకే ఇంగ్లీష్ మీడియంపై నిర్ణయం తీసుకున్నాం. 94శాతం పేరెంట్స్ కమిటీలు దీన్ని యునానిమస్ గా అంగీకారం తెలిపాయి'' అని వెల్లడించారు. 

''ఇలాంటి ఇంగ్లీష్ మీడియంను ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో అడ్డుకోవాలని ప్రయత్నించాయి. అయినా మేం వెనక్కి తగ్గలేదు. దీంతో తెలుగును  అగౌరపరిచినట్లుగా తమపై దుష్ప్రచారం చేశారు. అయినా మేం వారిని పట్టించుకోలేదు. చివరగా కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినా మ ఉక్కుసంకల్పం ముందు నిలబడలేదు'' అని తెలిపారు. 

''ఇంగ్లీష్ మీడియంపై రాష్ట్రంలోని 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకున్నాం. కొన్ని ఆప్షన్లతో కూడిన ప్రశ్నల ద్వారా సర్వే చేశాం. ఇందులోనూ ఇంగ్లీష్ మీడియం వుండాలని, తెలుగు ఒక సబ్జెక్ట్ కంపల్సరీ కావాలనే వారు 96 శాతం మంది వున్నారు. దీన్ని ఎస్ఈఆర్టీకి పంపించాం. సుప్రీంకోర్టుకు వెళుతున్నాం'' అని వెల్లడించారు. 

AP CM YS Jagan Special Meeting on Education Department

''ఒకటి నుండి ఆరవ  తరగతి వరకు ఈ ఏడాది ప్రారంభం. ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్ ను అందిస్తాం. స్కూళ్ల రూపురేఖలు మారుస్తాం. రాష్ట్రంలోని 47వేల ప్రభుత్వ విద్యాలయాల రూపురేఖ మార్పు కోసమే నాడునేడు. దీని ద్వారా పాఠశాలల్లో తొమ్మిది  రకాల సదుపాయాలు తప్పనిసరి చేశాం. ఈ జూలై నాటికి మొదటి విడతగా 15 వేళ్ల స్కూళ్లలో నాడు నేడు పూర్తి చేస్తాం. మూడు సంవత్సరాల్లో మొత్తం పూర్తి అవుతాయి'' అని వెల్లడించారు. 

''దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా అమ్మఒడి పథకం లాంటి కార్యక్రమం అమలుచేయడం. ఒకటి  నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఒకే రోజు నగదు జమ చేశాం. అయితే వచ్చే ఏడాది అమ్మఒడి  పథకం వర్తించాలంటే విద్యార్ధులకు 75శాతం అంటెడెన్స్ వుండాలి. వచ్చే ఏడాది జనవరి సంక్రాంతికి  ముందు మళ్లీ అమ్మఒడి ద్వారా డబ్బులు ఇస్తాం'' అని పేర్కొన్నారు.  

''టీచర్లకు ఇంగ్లీష్ మీడియం వల్ల సమస్యలు వుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్లకు నాలుగేళ్ల సమయం వుంది. అప్పటివరకు వారు ఇంగ్లీష్ లో బోధించడానికి సంసిద్దం అవుతారన్న నమ్మకం వుంది. విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు అందిస్తున్నాం. మన దగ్గర  పనిచేసే వారు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ల గౌరవమే పెరుగుతుంది. ఆ గౌరవ స్థాయికి మన పేద విద్యార్థుల వెళ్లాలి'' అన్నారు. 

read more  ఎట్టకేలకు పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పిన చంద్రబాబు

''ఆగస్ట్ 3 నుండి తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. ఆ రోజే జగనన్న విద్యా కానుక అందిస్తాం. ప్రతి పిల్లాడికి ఏడాదికి సరిపడా వస్తువులు  అందిస్తాం. అన్నీ ఉచితంగానే. ఇందుకోసం రూ.660కోట్ల ఖర్చు చేస్తున్నాం. ఇక స్కూల్ పిల్లల తిండిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందులో భాగంగా మొదట ఆయాల జీతాల పెంచాం.  సరుకులు, జీతాలు గ్రీన్ ఛానెల్ లో పెట్టాం.  రోజుకో మెనూ కోసం 15 రోజులు కుస్తీ పడ్డాం. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేలా ఓ మెనూను రూపొందించాం. ఇందుకోసం అదనంగా సంవత్సరానికి 460 కోట్లు ఖర్చు చేస్తున్నాం'' అని వెల్లడించారు.

''వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కు శ్రీకారం చుట్టాం. ఈసారి గత ప్రభుత్వం ఇస్తామన్న బకాయిలే 1880 కోట్లు చెల్లించాం. వీటితో పాటు ఈఏడాదికి కలుపుకుని 4200 కోట్లు బకాయిలు విడుదల చేశాం. దీంతో 19లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. వచ్చేసారి నుండి తల్లుల ఖాతాల్లోనే  ఫీజు రీయింబర్స్ మెంట్ జమచేస్తాం. దీని ద్వారా తల్లులకు విద్యాసంస్థలను  ప్రశ్నించే హక్కు వుంటుంది. త్వరలో నేనే తల్లులతో మాట్లాడతా'' అన్నారు.

''వసతి దీవెన కింద మెస్, హాస్టల్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి  పిల్లాడికి రెండు విడతల్లో 15-20 వేలు ఇస్తాం. ఇవి కూడా తల్లుల ఖాతాల్లోనే. విద్యావ్యవస్థలో  మార్పుల కోసం ఉన్నతాధికారులకు ఆదేశం. కాలేజీల్లో చదవే సమయంలోనే విద్యార్థులకు ఇంటర్న్ షిప్. ప్రతి ఒక్కరికి ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం'' అని  తెలిపారు.  

''విద్యా రంగంలో విపరీతంగా మార్పులు తీసుకురాబోతున్నాం. ఈ మార్పులను పరిశీలించేందుకే హైకోర్టు జడ్జీలకు బాధ్యతలు అప్పగించాం. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ భాద్యతలను ఒకరికి, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ బాధ్యతలు మరొకరికి అప్పగించాం. సూళ్లు, కాలేజీల విద్యా ప్రమాణాలు, సదుపాయలను తెలియజేసేలా ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాం'' అంటూ ఈ ఏడాది కాలంలో విద్యారంగంలో చేపట్టిన మార్పులు, సంస్కరణల గురించి ముఖ్యమంత్రి వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios