Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో అభివృద్ది పనులు సాగకండా కుట్రలు: విపక్షాలపై జగన్ ఫైర్


రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్ ఓ బీల ను వెంటనే చర్యలు తీసుకోవాలి.. ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకుండా డబ్బులు రాకుండా చేయాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

AP CM YS Jagan Serious Comments On Opposition Parties
Author
Guntur, First Published Jun 21, 2022, 3:33 PM IST

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా విపక్షాలు  కుట్రలు పన్నుతున్నాయని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు.. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని కోరుకుంటున్నాయన్నారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులపై  సీఎం జగన్‌ సమీక్షించారు.

కేసుల ద్వారా  పసులను అడ్డుకోవాలని తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.. అయినా సడలి సంకల్పంతో అడుగులు వేస్తూ సడలని సంకల్పంతో ముందుకుసాగుతున్నామన్నారు.

 ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.   

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.   పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయాలని సీఎం కోరారు. 

‘వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. .  ఈపనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. వేగంగా పనులు  పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేయాలన్నారు.

నివర్‌ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం కోరారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చాలన్నారు. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలి. పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios