Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్‌‌లోగా విశాఖకు మారుతాను.. ఇక్కడి నుంచే పాలన: సీఎం జగన్

తాను త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతుందని చెప్పారు.

ap cm ys jagan says will shift to visakhapatnam Before December ksm
Author
First Published Oct 16, 2023, 12:27 PM IST | Last Updated Oct 16, 2023, 12:42 PM IST

విశాఖపట్నం: తాను త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతుందని చెప్పారు. సీఎం జగన్ ఈరోజు విశాఖపట్నం మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నం అని అన్నారు. విశాఖలో పలు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్,బెంగళూరు, మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని చెప్పారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్దలు ముందుకొస్తున్నాయని అన్నారు. 

ప్రస్తుతం విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని.. మరో రెండేళ్లలో ఎక్స్‌క్లూజివ్ సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రానుందని చెప్పారు. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. విశాఖ నుంచే పరిపాలన జరగబోతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.  అక్టోబర్‌లోనే విశాఖకు రావాలని అనున్నామని చెప్పారు. అక్టోబర్‌ నాటికి రావాలనుకున్నానది డిసెంబర్‌కు కావొచ్చని తెలిపారు. అయితే డిసెంబర్‌‌లోపు విశాఖకు మారతానని స్పష్టం చేశారు. తాను వైజాగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు  కల్పిస్తామని చెప్పారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్న కంపెనీలకు కల్పించనున్నట్టుగా తెలిపారు. విశాఖపట్నంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ఇక, సీఎం జగన్ పరవాడలోని ఫార్మాసిటీకి వెళ్లనున్నారు. అక్కడ స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభిస్తారు. అనంతరం లారెస్ ల్యాబ్ కు చేరుకుని యూనిట్-2ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios