దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బుసలు కొడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బుసలు కొడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.

అయితే దేశంలో టీకాల కొరత వేధిస్తోంది. ఎక్కడికి వెళ్లినా నో వ్యాక్సిన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఏపీలోనూ కరోనా వ్యాక్సిన్ నిండుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి ఇటీవల వచ్చిన 6 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీని అధికారులు పూర్తి చేశారు. 

దీంతో మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో 2 నుంచి 3 లక్షల డోసులు రాష్ట్రానికి వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. 

మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఏపీ సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కరోజులోనే 6 లక్షల 4 వేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని అధికారులు జగన్‌కు వివరించారు.

Also Read:గుంటూరు జిల్లాలో కరోనా కలకలం... కలెక్టర్ కీలక ఉత్తర్వులు

దీంతో ఇదే తరహాలో వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు సీఎం. అదనపు వ్యాక్సిన్‌ డోసుల కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. అలాగే ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌పై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఏపీలో అందుబాటులో ఉన్న ఆక్సీజన్‌ బెడ్స్‌పై కూడా ఆరా తీశారు సీఎం. మరిన్ని బెడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ప్రజలను దోచుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 108 కొవిడ్‌ హాస్పిటల్స్‌ ఉండగా, వాటిని 230కి పెంచాలని అధికారులకు సూచించారు జగన్‌.