గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

గుంటూరు: దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కరోనా రోగులకు చికిత్స అదించేందుకుగాను జిల్లాలోని పలు హాస్పిటల్స్ లో బెడ్స్ సంఖ్యను పెంచారు. ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న 5 కోవిడ్ ఆసుపత్రులలో ఉన్న పడకలను పెంచుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆసుపత్రుల్లో పెంచిన పడకల వివరాలు...

1) ఎన్నారై ఆసుపత్రి 300 నుండి 750 కి,

2) ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్ లో 249 నుండి 600కు,

3) కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 245 నుండి 600కు,

4) మణిపాల్ ఆసుపత్రిలో 30 నుండి 50కి,

5) ఎఐఐఎంఎస్ మంగళగిరిలో 16 నుండి 30కి పడకలకి పెంచారు.

ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రయివేట్ ఆరోగ్యశ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను కూడా కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి తగు చర్యలు తీసుకొనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మరీ ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వుండాలని సూచించారు.