స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవారు ఎవరైనా సరే వదలొద్దని స్పష్టం చేశారు.

ఈ అంశాల్లో ఎవరిని ఉపేక్షించొద్దన్న జగన్.. అక్రమ పనులు ఏవైనా అస్సలు ఊరుకోవద్దని ఆదేశించారు. ఈ విషయంలో తాను అండగా ఉంటానని అధికారులకు హామీ ఇచ్చారు జగన్.

ఎరువుల సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కొన్ని జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.