'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ తీసుకొన్న నిర్ణయాలపై వస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. తనపై విమర్శలు చేసిన వారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

Ap Cm Ys Jagan Responds on compulsory English up to 6th class in Andhra pradesh

అమరావతి: చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడు పిల్లలు, మనమలు ఏ స్కూల్లో చదవించారో చెప్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు..సోమవారం నాడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి  కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సిన అవసరం ఉందన్నారు.పేద పిల్లలకు ఇంగ్లీష్ చదివించడం ఇష్టం లేనట్టుగా  కొందరు నేతలు మాట్లాడుతున్నారని సీఎం వైఎస్ జగన్విమర్శించారు. చంద్రబాబునాయుడు తన కొడుకును మనమడిని ఏ స్కూల్లో చదివించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురో లేదా ఐదుగురో పిల్లలు ఉన్నారు. వీరంతా ఏ  మీడియం స్కూల్లో చదువుతున్నారో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు.

ALSO READ;ఏపి సీఎం జగన్ ఓ పిచ్చోడు...అందుకు నిదర్శనాలివే...: బుద్దా వెంకన్న

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన పిల్లలు లేదా మనమళ్లను ఏ మీడియం స్కూల్లో చదవిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 

Also read:బడుల్లో ఇంగ్లీష్ మీడియం: వైఎస్ జగన్ నిర్ణయంలోని ఆంతర్యం ఇదే....

దేశమంతటా నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు. 2008లో దివంగత నేత వైఎస్ఆర్ మైనారిటీ వెల్ఫేర్ గా ప్రకటించి జాతీయవిద్యా దినోత్సవ ఉత్సవాలు, మైనారిటీ ఉత్సవాలను ఒకే రోజు జరుపుకుంటామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఒక దీపానికి వెలుగునిస్తే కుటుంబం మొత్తానికి వెలుగునిస్తుందని సీఎం జగన్ చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు చదివితే ఆ కుటుంబం బాగుపడతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

2011 జనభా లెక్కల ప్రకారం ఏపీలో చదువురాని వారి సంఖ్య 33%, దేశంలో‌ చూస్తే 27%గా ఉందని సీఎం తెలిపారు. అందరూ కూడ చదువుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. 

ప్రపంచంలో పోటీతత్వం బాగా పెరిగిందన్నారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా వచ్చుండాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

ఇంగ్లీషు రాకపోతే మన పిల్లలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు.  ఏపీలో‌ 45 వేల స్లూళ్లు ఉన్నాయి. 15 వేల స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా మార్లు తీసుకొస్తాం, తర్వాత మిగిలిన స్కూళ్లో కూడా అమలు చేస్తామన్నారు. 

ప్రతి స్కూల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టి తెలుగు, ఉర్దూ భాషలో తప్పని సరిగా చదివే సబ్జెక్టులు ఉంచుతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 1వ తరగతి నుండి 6వ తరగత వరకు ఇంగ్లీషు తప్పనిసరిగా ప్రవేశపెడతామని జగన్ స్పష్టం చేశారు.  ఆ తర్వాత 7వ తరగతి నుంచి ఇంగ్లీషు ఉంటుందన్నారు.

త్వరలో డిగ్రీ స్థాయిలో అప్రెంటీస్ విధానాన్ని కూడ ను కూడా ప్రవేశపెడతామని జగన్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ఫీజ్ రీయంబర్స్ మెంట్ ప్రవేశపెడతామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. 

మన పిల్లలు ‌గొప్పగా ఎదగాలని తాము అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. మదర్శాలకు మంచి జరిగేటట్లుగా మదర్శాబోర్డు ఏర్పాటుకు ఆదేశాలిస్తున్నట్టుగా వైఎస్ జగన్ ప్రకటించారు.

అమ్మ ఒడి పథకాన్ని మదర్శాలను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి లో వైఎస్ఆర్ పెళ్లి కానుక అమలు చేస్తామన్నారు. చంద్రబాబు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios